రెప్పపాటులో కోట్లు విలువచేసే నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.. వీడియో ఇదిగో!
––
దుకాణం ప్రవేశ ద్వారాన్ని బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు.. తుపాకీతో సిబ్బందిని బెదిరించి, ఆరు డిస్ ప్లే కేస్ లలోని వజ్రాల నగలు, ఖరీదైన వాచ్ లను తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్ లలో వేసుకుని పట్టుకెళ్లారు. ఈ ఘరానా దోపిడీ మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దుకాణం యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.