Chandrababu Naidu: విజయవాడలో పోలీసు వందనం స్వీకరించిన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
- విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ
- పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం
- ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాల ప్రదర్శన, పోలీసుల పరేడ్
- భారీగా హాజరైన విద్యార్థులు, నగర ప్రజలు
- పాల్గొన్న సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు
భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు విజయవాడలో అట్టహాసంగా జరిగాయి. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మువ్వన్నెల జెండాకు వందనం చేసి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్టేడియం అంతా పర్యటించిన ముఖ్యమంత్రి, పరేడ్‌లో పాల్గొన్న సాయుధ బలగాల కవాతును పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజలకు, విద్యార్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసు బెటాలియన్లు, ఎన్‌సీసీ విద్యార్థులు చేసిన కవాతు ఆకట్టుకుంది. స్వాతంత్ర్య వేడుకలను వీక్షించేందుకు నగర పౌరులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.