విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు, పరేడ్ ఆకట్టుకున్నాయి. పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు.