Cyberabad Police: మాదాపూర్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. విదేశీ యువతులకు విముక్తి

Cyberabad Police Bust International Sex Racket in Madhapur
  • మాదాపూర్‌లోని లగ్జరీ హోటల్‌లో అంతర్జాతీయ వ్యభిచార దందా
  • ఉజ్బెకిస్థాన్, తుర్కెమెనిస్థాన్ యువతులతో వ్యాపారం
  • హోటల్ సిబ్బంది సహా ఏడుగురు నిందితుల అరెస్ట్
  • తొమ్మిది మంది యువతులకు విముక్తి 
  • వెబ్‌సైట్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ముఠా
  • గుట్టురట్టు చేసిన సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం
నగరంలోని ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 9 మంది బాధిత యువతులకు విముక్తి కల్పించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం డీసీపీ కరణం సృజన నిన్న మీడియాకు వెల్లడించారు. నాంపల్లికి చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమీద్ సింగ్ ప్రధాన సూత్రధారిగా ఈ దందాను నడిపిస్తున్నట్టు తెలిపారు. ఇతను తన అనుచరులు నిఖిల్, సోనియాసింగ్, విశాల్ భయ్యా, శ్రుతి, రోహిత్, రమేశ్ తదితరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని వివరించారు.

ఈ ముఠా తమ కార్యకలాపాలకు మాదాపూర్‌లోని బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్‌ను అడ్డాగా మార్చుకుంది. అక్కడి సూపర్‌వైజర్లు అయిన తమ్మి శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లుతో ఒప్పందం కుదుర్చుకుని, విటుల కోసం గదులను బుక్ చేయించేవారని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా విటులను ఆకర్షించి, వారితో బేరసారాలు జరిపిన తర్వాత నేరుగా ఈ హోటల్‌కు పంపేవారని దర్యాప్తులో తేలింది. ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమీషన్ చెల్లించేవారని డీసీపీ తెలిపారు.

పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఆ హోటల్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడు హమీర్ సింగ్‌తో పాటు, హోటల్ సూపర్‌వైజర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మరికొందరు విటులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తొమ్మిది మంది యువతులను రక్షించి, నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
Cyberabad Police
Madhapur
international sex racket
prostitution racket busted
Hyderabad
Hameer Singh
foreign women rescued
sex trafficking
BSR hotel
Karana Srujana

More Telugu News