Mohammed Shami: కన్నకూతురిని పట్టించుకోకుండా ప్రియురాలి పిల్లలను చదివిస్తున్నాడు: షమీపై హసీన్ జహాన్ ఫైర్

Mohammed Shami Accused of Neglecting Daughter by Haseen Jahan
  • భారత క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు
  • కన్న కూతురి చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదన
  • ప్రియురాలి పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాడని విమర్శ
  • షమీ నుంచి నెలకు రూ. 4 లక్షల భరణం పొందుతున్న జహాన్
  • ప్రస్తుతం ఆసియా కప్, దులీప్ ట్రోఫీకి సిద్ధమవుతున్న షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.  కన్నకూతురు ఐరా (10) చదువును పూర్తిగా గాలికొదిలేసి, ప్రియురాలి పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాడని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హసీన్ జహాన్ తన ఆరోపణల్లో, షమీ తన ప్రియురాలి పిల్లలను ఖరీదైన పాఠశాలల్లో చదివిస్తున్నాడని, వారి కోసం బిజినెస్ క్లాస్ విమాన టికెట్లకు లక్షలు ఖర్చు చేస్తున్నాడని పేర్కొన్నారు. "నా కూతురి తండ్రి కోటీశ్వరుడు... కానీ, ఓ స్త్రీలోలుడిగా మారిపోయాడు. ఐరా జీవితంతో చెలగాటమాడుతున్నాడు. ప్రియురాలి పిల్లల చదువులకు లక్షలు ఖర్చు చేస్తాడు కానీ, కన్న కూతురి చదువు విషయానికొచ్చేసరికి డబ్బు లేదని చెబుతున్నాడు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తన కూతురు ఐరా ఇటీవల ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పాఠశాలలో చేరినట్లు కూడా జహాన్ తెలిపారు. "నా కూతురు మంచి పాఠశాలలో చేరకుండా శత్రువులు ఎన్నో కుట్రలు చేశారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ల పన్నాగాలు విఫలం అయ్యాయి" అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.

చట్టపరంగా షమీ నుంచి హసీన్ జహాన్‌కు నెలకు రూ. 4 లక్షల భరణం అందుతోంది. ఇందులో రూ. 2.5 లక్షలు కూతురు ఐరా బాగోగుల కోసమే కేటాయించారు. షమీ, జహాన్‌ల వివాహం 2014లో జరగ్గా, 2015లో వారికి ఐరా జన్మించింది. కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ 2025 దులీప్ ట్రోఫీ, ఆసియా కప్‌లకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షమీ, సాధారణ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాలేదు.
Mohammed Shami
Haseen Jahan
Shami controversy
Ira Shami
domestic dispute
child education
Duleep Trophy
Asia Cup
Sunrisers Hyderabad
Indian cricketer

More Telugu News