Donald Trump: ట్రంప్, పుతిన్ భేటీ ఎఫెక్ట్... స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Trump Putin Meeting Impact Stock Markets Close with Slight Gains
  • 57 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 11 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.57
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ రేపు భేటీ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు మార్కెట్లకు సెలవు కావడం కూడా మదుపరుల అప్రమత్తతకు మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 80,597కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,631 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.57గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ తదితర షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్ తదితర షేర్లు నష్టపోయాయి.
Donald Trump
Vladimir Putin
Stock Markets
Sensex
Nifty
Indian Rupee
Infosys
HDFC Bank
Share Market
Trump Putin Meeting

More Telugu News