Himachal Pradesh floods: హిమాచల్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు.. అతలాకుతలమైన జనజీవనం

Himachal Pradesh Floods Roads Bridges Destroyed Life Disrupted
  • నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • రాష్ట్రవ్యాప్తంగా 300కుపైగా రోడ్లు మూత
  • సిమ్లాలో కూలిపోయిన బస్టాండ్, కొట్టుకుపోయిన పోలీస్ ఔట్‌పోస్ట్
  • క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా సిమ్లా, లాహౌల్-స్పితి జిల్లాల్లో మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) సంభవించి ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా రోడ్లు మూతపడగా, వాటిలో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి.

సిమ్లాలో కురిసిన కుండపోత వర్షానికి బస్టాండ్ కూలిపోయింది. పక్కనే ఉన్న దుకాణాలు దెబ్బతిన్నాయి. రెండు వంతెనలు కొట్టుకుపోవడంతో కూట్, క్యావ్ పంచాయతీలకు రోడ్డు మార్గం పూర్తిగా తెగిపోయింది. గాన్వి రేవైన్ ప్రాంతంలో వరదల ధాటికి ఒక పోలీస్ పోస్ట్ కూడా కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 లాహౌల్-స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో మేఘ విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్ నాలా ప్రాంతాల్లో మరో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారులు ఎన్‌హెచ్-305 (ఆట్-సైంజ్), ఎన్‌హెచ్-505 (ఖబ్ నుంచి గ్రామ్‌ఫూ) సహా మొత్తం 325 రోడ్లు మూతపడ్డాయి. ఇందులో మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. 
Himachal Pradesh floods
Himachal Pradesh
floods
Shimla
Lahaul Spiti
cloudburst
road damage
bridge collapse
national highway
heavy rainfall

More Telugu News