Jaggareddy: మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే మాకు అనుమానాలు వచ్చాయి: జగ్గారెడ్డి

Jaggareddy Suspects Foul Play in Modis Third Term Win
  • మోదీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమన్న జగ్గారెడ్డి
  • ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ కు అందరూ మద్దతు ఇవ్వాలని విన్నపం
  • కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్న నేతలే అని వ్యాఖ్య
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ, ఆరెస్సెస్ ఇచ్చిన స్క్రిప్ట్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చదువుతున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లను సృష్టించారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగం ఉండకూడదనేది బీజేపీ కుట్ర అని చెప్పారు. 

ఊహించని విధంగా మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే తమకు అనుమానాలు వచ్చాయని జగ్గారెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలిచేందుకు ప్రణాళికలు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ దమ్మున్నోళ్లమేనని, కోమటిరెడ్డి సోదరులు కూడా దమ్మున్నవాళ్లేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ స్క్రిప్ట్ చదవాలి కనుక ఆ పని చేశారని చెప్పారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి అయినా బీజేపీ స్క్రిప్ట్ చదవాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు.
Jaggareddy
TPCC
BJP
Election Commission
Rahul Gandhi
Fake Votes
RSS
Komati Reddy
Kiran Kumar Reddy
Purandeswari

More Telugu News