Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట కౌంటింగ్ ప్రారంభం.. తీవ్ర ఉత్కంఠ

Pulivendula Ontimitta Counting Begins Amid Tension
  • కడపలో కొనసాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
  • కౌంటింగ్ ను బహిష్కరించిన వైసీపీ
  • గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. వైసీపీ అధినేత జగన్ అడ్డా కావడంతో ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. కడపలోని మౌలానా అజాద్ నేషన్ ఉర్దూ యూనివర్శిటీలో ఓట్లను లెక్కిస్తున్నారు. 

పులివెందుల కౌంటింగ్ ను 10 టేబుళ్లపై ఒక రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట కౌంటింగ్ ను 10 టేబుళ్లపై 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. 30 మంది సూపర్ వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు విధుల్లో ఉన్నారు. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

మరోవైపు పులివెందులలో 74 శాతం ఓటింగ్ నమోదు కాగా... ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదయింది. ఎన్నికల్లో టీడీపీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించింది. రెండు స్థానాల్లో గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Pulivendula
Pulivendula ZPTC election
Ontimitta
Ontimitta ZPTC election
YS Jagan
Andhra Pradesh local body elections
Kadapa district
TDP
YSRCP
election counting

More Telugu News