Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు

Telangana districts to receive heavy rainfall today
    
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 

అలాగే, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Telangana Rains
Telangana heavy rains
Hyderabad rains
Red alert
Weather forecast
IMD
Rain alert
Sangareddy
Medak
Vikarabad

More Telugu News