Revanth Reddy: రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Relief to Revanth Reddy in Telangana High Court
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
  • 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లాలో రేవంత్ పై కేసు నమోదు
  • కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించిన హైకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పరిధిలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ రేవంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ పిటిషన్ పై ధర్మాసనం పలుమార్లు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Revanth Reddy
Telangana
Telangana High Court
Election Code Violation
Suryapet
Garidepally
Case Dismissed
Telangana Politics

More Telugu News