Georgia Meteorite: అమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క.. భూమికంటే పురాతనమైందని గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీడియో ఇదిగో!

Georgia Meteorite Older Than Earth Scientists Discover
––
అమెరికాలోని జార్జియాలో ఇటీవల రాలిన ఉల్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయం గుర్తించారు. సదరు ఉల్క శకలం భూమికంటే పురాతనమైందని వెల్లడించారు. గత జూన్‌ 26న జార్జియాలోని మెక్‌డొనౌగ్‌లో ఓ ఇంటిపై ఉల్క శకలం పడింది. ఇంటి పైకప్పును శిథిలం చేస్తూ నేలను తాకింది. సూపర్‌ సోనిక్‌ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చాలా దూరం వినిపించింది. చిన్న చెర్రీ పండు పరిమాణంలో 23 గ్రాముల బరువున్న ఈ శకలం తాకిడికి నేలపై చిన్న గుంత ఏర్పడింది.

ఈ శకలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శకలం దాదాపు 4.56 బిలియన్‌ సంవత్సరాల క్రితం తయారైందని జియాలజిస్టులు తెలిపారు. అంటే ఇది భూమి కంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని చెప్పారు. అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోకచుక్క నుంచి విడివడ్డ శకలం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Georgia Meteorite
Meteorite
Georgia
McDonough
Space Rock
Meteor
Earth
Solar System

More Telugu News