Roja: తిరుమలలో ఒకరికొకరు ఎదురుపడ్డ రోజా, సీపీఐ నారాయణ... వీడియో ఇదిగో!

CPI Narayana surprised to see Roja in Tirumala
  • నేడు శ్రావణ పౌర్ణమి
  • తిరుమలలో సందడి చేసిన వీఐపీలు
  • కాసేపు మాట్లాడుకున్న రోజా, నారాయణ
  • నెట్టింట సందడి చేస్తున్న వీడియో
ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రముఖులు సందడి చేశారు. వైసీపీ నేత రోజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట ఆసక్తికర దృశ్యం కనిపించింది. రోజా, నారాయణ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రోజాను చూసి నారాయణ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Roja
Roja Selvamani
CPI Narayana
Tirumala
Sravana Pournami
YCP leader
CPI leader
AP Politics
Andhra Pradesh
Tirupati

More Telugu News