CPI Narayana: తవ్వేకొద్దీ ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయి.. అది దేవస్థానమా లేక శ్మశానమా?: సీపీఐ నారాయణ

CPI Narayana Alleges 500 Rapes and Murders at Dharmasthala
  • కలకలం రేపుతున్న ధర్మస్థల మిస్టరీ హత్యలు
  • 500 మంది అమ్మాయిలపై హత్యాచారం చేసి పూడ్చి పెట్టారన్న నారాయణ
  • ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మిస్టరీ హత్యలు కలకలం కేపుతున్నాయి. ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారని ఆయన ఆరోపించారు. ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని నారాయణ తెలిపారు. ట్రస్ట్ కు ప్రతి ఏడాది రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ట్రస్ట్ ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 500 మందిపై హత్యాచారం చేసి పూడ్చిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వేకొద్దీ ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయని చెప్పారు. అది దేవస్థానమా లేక శ్మశానమా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారని... అదే వేరే ప్రభుత్వం ఉంటే అసలు ఈ విషయం బయటకు వచ్చేది కాదని అన్నారు. 
CPI Narayana
Dharmasthala
Dharmasthala Temple
Karnataka
Sexual Assault
Murder Mystery
Corruption
Endowment Department
SIT Investigation

More Telugu News