Amar Preet Singh: 5 పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం: ఎయిర్ ఫోర్స్ చీఫ్

Air Force Chief claims 5 Pakistani warplanes downed
  • ఆపరేషన్ సిందూర్ లో పాక్ కు జరిగిన నష్టంపై తాజాగా వివరణ
  • మరో భారీ విమానాన్ని కూడా నేలకూల్చామన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌
  • వీటిని కూల్చేసిన ఘనత ఎస్–400 దేనని వెల్లడి
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు భారీగా నష్టం వాటిల్లిందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తాజాగా వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించామన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడానికి క్షిపణులు వినియోగించామని చెప్పారు. ప్రతిదాడులు చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నించగా మన సేనలు సమర్థమంతంగా అడ్డుకున్నాయని వివరించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలు మన సరిహద్దుల్లోకి రాగా ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని చెప్పారు.

రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 డిఫెన్స్ మిసైల్ లాంచర్ తో ఈ ఐదు విమానాలతో పాటు మరో భారీ విమానాన్ని కూడా కూల్చేశామని అమర్ ప్రీత్ సింగ్ వివరించారు. వీటన్నింటినీ గాల్లోనే ఎదుర్కొన్నామని చెప్పారు. అదే సమయంలో ఎయిర్ బేస్ లో పార్క్ చేసిన మరో రెండు విమానాలను కూడా మన క్షిపణులు ధ్వంసం చేశాయని వివరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్‌ వ్యవస్థలు బాగా పనిచేశాయని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు.
Amar Preet Singh
Indian Air Force
Pakistan
Operation Sindoor
S-400 missile
Fighter jets
Air Force Chief
India Pakistan conflict
Terrorist camps

More Telugu News