Rachamallu Sivaprasad Reddy: ఓటమి భయంతో పులివెందులలో టీడీపీ కుట్రలకు తెరలేపింది: రాచమల్లు శివప్రసాదరెడ్డి

TDP Inciting Conspiracies in Pulivendula Due to Fear of Loss Rachamallu
  • ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందన్న రాచమల్లు
  • టీడీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని మండిపాటు
  • సాక్షి సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నాారని ఆగ్రహం
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. అధికార అండతో అధికారులను టీడీపీ విచ్చలవిడిగా వాడుకుంటోందని మండిపడ్డారు. 

పులివెందులలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసని రాచమల్లు అన్నారు. వైఎస్ అనే పేరుకు పులివెందులలో ఓటమే లేదని చెప్పారు. సాక్షి సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా సిబ్బంది అంతా వైసీపీ కుటుంబ సభ్యులేనని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఎద్దేవా చేశారు.
Rachamallu Sivaprasad Reddy
Pulivendula
TDP
YSRCP
ZPTC election
Andhra Pradesh politics
election malpractice
Sakshi media
YS family
political conspiracy

More Telugu News