Delhi Crime: ఢిల్లీలో డిటెక్టివ్ తో కూతురిపై నిఘా పెట్టిన తల్లిదండ్రులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Private Detective Uncovers Shocking Truth About Delhi Student
  • వారానికి ఓసారి వేశ్యావాటికకు వెళుతున్న కూతురు
  • యూనివర్సిటీలో చదువుతున్న యువతి పెడతోవ
  • షాపింగ్ కు, పార్టీలకు డబ్బుల కోసం విటుల దగ్గరికి వెళుతున్న వైనం
యూనివర్సిటీలో చదువుతున్న కూతురుపై అనుమానంతో తల్లిదండ్రులు డిటెక్టివ్ ను నియమించి నిఘా పెట్టారు. అడ్వాన్స్ తీసుకుని యువతిని నీడలా వెంటాడిన మహిళా డిటెక్టివ్ కు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. సదరు యువతి ఖరీదైన దుస్తులు, స్నేహితులతో విందుల కోసం పక్కదారి పట్టిందని తేలింది. వారానికి ఓసారి వేశ్యావాటికకు వెళుతూ డబ్బు కోసం ఒళ్లు అమ్ముకుంటోందని గుర్తించింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియజేసి, ఫొటోలతో వాస్తవాలు వెల్లడించింది.

ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సదరు మహిళా డిటెక్టివ్ ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే ఇలా నిఘా పెట్టడం అనైతికమని, మరొకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం సరికాదని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఘటనలో సదరు తల్లిదండ్రులదే తప్పని అంటున్నారు. కూతురుకు సరిపడా పాకెట్ మనీ ఇవ్వలేరు కానీ ప్రైవేట్ డిటెక్టివ్ ను నియమించి మరీ నిఘా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Delhi Crime
Delhi
Private Detective
Prostitution
Parents
University Student
Pocket Money
Social Issues

More Telugu News