Pakistan Man: 28 ఏళ్ల కిందట మిస్సింగ్.. కరుగుతున్న మంచు కొండలో బయటపడ్డ డెడ్ బాడీ

Pakistan Man Naseeruddin Body Discovered After 28 Years
  • మంచులో కూరుకుపోవడంతో చెక్కుచెదరని మృతదేహం
  • మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
  • పాకిస్థాన్ లో ని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన
గ్రామంలో జరిగిన ఓ గొడవ నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఓ యువకుడు మంచుకొండలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత వెతికినా డెడ్ బాడీ కూడా దొరకలేదు. తాజాగా మంచు శిఖరం కరగడంతో అనూహ్యంగా 28 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి మృతదేహం బయటపడింది. ఇన్నేళ్లు గడిచినా మృతదేహం చెక్కుచెదరకుండా ఉండడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో చోటుచేసుకుందీ ఘటన. ఇన్ని సంవత్సరాల తర్వాత మృతదేహం దొరకడంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు జరిపి ఊరట పొందారు.
 
ఖైబర్ ఫఖ్తుంఖ్వా రీజియన్ లోని కోహిస్థాన్ కు చెందిన నసీరుద్దీన్ 1997 లో తన సోదరుడు కథీరుద్దీన్ తో కలిసి గ్రామం నుంచి పారిపోయాడు. ఓ మంచు కొండ పైనుంచి వెళుతుండగా నసీరుద్దీన్ లోయలో పడిపోయాడు. దీంతో కథీరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులు లోయలో గాలించినా నసీరుద్దీన్ ఆచూకీ లభించలేదు. పైనుంచి పడిపోవడంతో చనిపోయాడని అనుకున్నా కనీసం మృతదేహం కూడా లభించలేదు.

ఈ ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత తాజాగా ఓ మంచు కొండ కరగడంతో నసీరుద్దీన్ మృతదేహం బయటపడింది. చెక్కుచెదరకుండా ఉన్న డెడ్ బాడీ పక్కనే ఉన్న గుర్తింపు కార్డుతో అతనిని నసీరుద్దీన్ గా గుర్తించారు. మంచులో కూరుకుపోవడంతో మృతదేహం పాడవకుండా అలాగే ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, పోలీసుల సాయంతో నసీరుద్దీన్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
Pakistan Man
Glacier
Dead body found
Khyber Pakhtunkhwa
Kohistan
missing person
cold storage
1997 incident
28 years later

More Telugu News