YS Sunitha: పులివెందులలో జరుగుతున్నవి చూస్తుంటే నా తండ్రి హత్య గుర్తొస్తోంది: వైఎస్ సునీత
- కడప ఎస్పీని కలిసిన సునీత, ఆమె భర్త
- గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అన్నారని మండిపాటు
- దోషులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆవేదన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వీరు వివరించారు. హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఎస్సీని వీరు కలిశారు.
అనంతరం మీడియాతో సునీత మాట్లాడుతూ... జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గత రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేకా హత్య గుర్తొస్తోందని అన్నారు. గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అని చెప్పారని మండిపడ్డారు. టీడీపీ నేతలే చంపారని నమ్మబలికారని అన్నారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ను చెరిపేశారని చెప్పారు. ఆ తర్వాత ఓ లేఖ తీసుకొచ్చి తన తండ్రిని ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్టు సంతకం చేయమంటే తాను చేయలేదని తెలిపారు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా అదే జరుగుతోందని అన్నారు.
వివేకా హత్య కేసుపై గత ఆరేళ్లుగా పోరాడుతున్నానని సునీత చెప్పారు. ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. వివేకాను తాను, తన భర్త హత్య చేసినట్టు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.