Donald Trump: భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్... కీలక వ్యాఖ్యలు చేసిన శశిథరూర్

Shashi Tharoor Criticizes Trumps Tariffs on India
  • రష్యా నుంచి అమెరికా యురేనియం దిగుమతి చేసుకుంటోందన్న థరూర్
  • అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపాటు
  • ఇండియా కొత్త వాణిజ్య భాగస్వాములను చూసుకోవాలని సూచన
రష్యాతో చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఇండియా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్... ఆ తర్వాత మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. ఓపక్క రష్యా నుంచి అమెరికా యురేనియం, పల్లాడియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటూ.. మరోపక్క భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. మనకంటే ఎక్కువగా రష్యన్ చమురును చైనా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. భారత్ పై ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. 

ఈ అనుభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని థరూర్ సూచించారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఇతర వాణిజ్య భాగస్వాములను చూసుకోవడాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Donald Trump
India tariffs
Shashi Tharoor
US India relations
Russian oil imports
India Russia trade
US trade policy
China Russian oil
Indian economy
Trade relations

More Telugu News