Pulivendula: పులివెందుల టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు.. వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు

Pulivendula TDP Leaders Face Attempted Murder Case
  • వైసీపీ నేత వేముల రాము ఫిర్యాదుతో 25 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు 
  • టీడీపీ నేత ధనుంజయ ఫిర్యాదుపై వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
  • ఎంపీ అవినాశ్ రెడ్డి తదితరులపై కోడ్ ఉల్లంఘన కేసు  
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారాల నేపథ్యంలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో వైసీపీ నేత వేముల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు 25 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో ఎమ్మెల్సీ రమేశ్, తాను ఎన్నికల ప్రచారంలో ఉండగా టీడీపీ నేతలు కార్లతో గుద్ది, ఆపై కర్రలతో దాడి చేశారని వేముల రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సోదరుడు భరత్ రెడ్డితో పాటు మరో 24 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు టీడీపీ నేత ధనుంజయ చేసిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు వేముల రాము, హేమాద్రిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

మరోపక్క, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగాలపై పది మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. 
Pulivendula
Pulivendula ZPTC Election
Andhra Pradesh Politics
TDP
YSRCP
Vemula Ramu
B Tech Ravi
Avinash Reddy
SC ST Atrocity Act
Election Code Violation

More Telugu News