పుష్ప 2 తొక్కిసలాట ఘటన.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు
జనం పెద్ద సంఖ్యలో గుమికూడినప్పటికీ, తగినంత భద్రత కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఎందుకు చెల్లించకూడదో వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. అలాగే, ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ జరిపి, ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.