Katihar district: రహస్యంగా కలుసుకున్న వివాహిత, ప్రియుడు.. పట్టుకుని శిరోముండనం చేసి ఊరేగించిన గ్రామస్థులు!

Adulterous couple humiliated in Katihar Bihar
  • బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఘటన
  • రహస్యంగా కలుసుకున్న జంటను పట్టుకున్న గ్రామస్థులు
  • దాడిచేసి, ముఖానికి నల్ల రంగు పూసిన వైనం
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. రహస్యంగా కలుసుకున్న వివాహిత, ఆమె ప్రియుడికి గ్రామస్థులు దారుణమైన శిక్ష విధించారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి, గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని రహతా గ్రామంలో జరిగింది. 40 ఏళ్ల షకీల్, 32 ఏళ్ల సునీత మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరికీ ఇదివరకే ఎవరికీ వారికి పెళ్లి జరిగి, పిల్లలు కూడా ఉన్నారు. వారు రహస్యంగా కలుసుకోగా గ్రామస్థులు పట్టుకున్నారు.

  స్థానిక పంచాయితీ పెద్దల ఆదేశాల మేరకు ఈ జంటపై గ్రామస్థులు దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటపడగానే షకీల్ భార్య పోలీసులను ఆశ్రయించి సాయం అర్థించింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఈ అమానుష చర్యకు  పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  
Katihar district
Bihar crime
Adultery punishment
Illegal relationship
Moral policing India
Village justice
Public shaming
Katihar incident
Affair
India crime news

More Telugu News