Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Free Bus Travel for AP Women
  • ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  • పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశం
  • జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందన్న చంద్రబాబు
రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించకముందే... ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన సూచనను మెచ్చుకున్న చంద్రబాబు... ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయాంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలికగా అంగీకరించలేదని తెలిపారు. వైసీపీ హయాంలో సింగపూర్ కు వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని మండిపడ్డారు. 

మరోవైపు నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.... కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు.
Chandrababu Naidu
AP Free Bus Travel
Andhra Pradesh
AP Women Free Bus
N Nadendla Manohar
Singapore Government
AP Investments
New Bar Policy

More Telugu News