Deepak: తల్లి ఖాతాలో కోటీ 13 లక్షల కోట్లు డిపాజిట్.. ఫోన్లో మెసేజ్ చూసి కొడుకు షాక్

Deepak shocked after seeing crores in mothers account
  • ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సంచలనంగా మారిన ఉదంతం
  • బ్యాంకును ఆశ్రయించిన యువకుడు.. కోటక్ మహేంద్ర బ్యాంకులో ఘటన
  • అలాంటి ఘటన ఏమీ జరగలేదంటూ బ్యాంకు అధికారుల వివరణ
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు.. బ్యాంకు ఖాతాలో ఒకటీ రెండు కోట్లు కాదు ఏకంగా కోటి కోట్లు వచ్చిపడ్డాయి. రెండు నెలల క్రితం మరణించిన తల్లి గాయత్రీ దేవి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ అయినట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో షాక్ కు గురయ్యాడు. మెసేజ్ లో పేర్కొన్న అంకెలను లెక్కబెట్టడం తనవల్ల కాక స్నేహితుల సాయం కోరాడు. తల్లి ఖాతాలో రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299. జమ అయినట్లు వచ్చిన మెసేజ్ ను చూపించాడు. నోయిడాకు చెందిన దీపక్‌ (20) అనే కుర్రాడికి ఎదురైందీ అనుభవం.

ఉదయం ఆ మెసేజ్‌ చూసిన దీపక్‌ వెంటనే డాంకౌర్‌ పరిధిలోని బ్యాంకుకు పరుగు తీశాడు. షాక్‌కు గురైన బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభింపజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కోటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు స్పందించారు. యువకుడి తల్లి ఖాతాలో కోటి కోట్లు జమ అయినట్లు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని వివరణ ఇచ్చారు. అలాంటి సంఘటన ఏదీ తమ బ్యాంకులో చోటుచేసుకోలేదని వారు స్పష్టం చేశారు.
Deepak
Noida
Uttar Pradesh
Kotak Mahindra Bank
Bank Account
Crore
Gayatri Devi
Deposit
Bank Message
Viral News

More Telugu News