Viral Video: ఆహారం తింటున్న సింహాన్ని వీడియో కోసం కవ్వించాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఘటన
- యువకుడిపైకి దూసుకొచ్చిన సింహం
- ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ యువకుడు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల తీవ్ర విమర్శలు
సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు యువకులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో ఓ యువకుడి తాలూకు ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆహారం తింటున్న సింహానికి అత్యంత సమీపంగా వెళ్లి వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అడవిలో ఒక సింహం తాను వేటాడిన జంతువును తింటోంది. ఆ సమయంలో ఓ యువకుడు తన ఫోన్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్లాడు. ఆ మృగరాజుతో ఓ క్లోజప్ వీడియో తీయాలన్నది అతని ఉద్దేశం. మొదట తన ఆహారంలో నిమగ్నమైన సింహం, కాసేపటికి తన దగ్గరికి వస్తున్న వ్యక్తిని గమనించింది.
వెంటనే తీవ్ర ఆగ్రహానికి లోనైన సింహం, పెద్దగా గర్జిస్తూ ఆ యువకుడి వైపు దూసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు, నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ అక్కడి నుంచి తప్పుకున్నాడు. అదృష్టవశాత్తూ సింహం తన ఆహారం వద్దకు తిరిగి వెళ్లిపోవడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు భయంతో కేకలు వేయడం వీడియోలో వినిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ యువకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇలాంటి మూర్ఖపు పనులు చేయడం సరికాదని మండిపడుతున్నారు. వన్యప్రాణులు, ముఖ్యంగా సింహం వంటి క్రూర మృగాల వద్ద అత్యంత జాగ్రత్తగా మెలగాలని, వాటి సహజ ఆవాసాలకు భంగం కలిగించవద్దని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.