US Embassy: వీసా నిబంధనలను గౌరవించండి.. భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరిక

US Embassy Warns Indians to Respect Visa Rules
  • గడువు దాటినా అమెరికాలోనే ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న ఎంబసీ
  • వీసా రద్దుతో పాటు వెతికిపట్టుకుని వెనక్కి పంపిస్తామని వెల్లడి
  • భవిష్యత్తులో అమెరికాలో అడుగుపెట్టలేరని వార్నింగ్
ఉన్నత చదువుల కోసమో, తాత్కాలిక ఉద్యోగం కోసమో అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ‘మీ వీసా నిబంధనలను గౌరవించండి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. వీసా నిబంధనలను.. ముఖ్యంగా అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనే నిబంధనను కచ్చితంగా పాటించాలని సూచించింది. గడువు దాటినా అక్కడే ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు వీసా గడువు ముగిసిన తర్వాత మరే ఇతర అనుమతి పొందకుండా అక్కడే ఉండిపోవడం నేరమని వివరించింది.

వీసా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెబుతూ.. గడువు దాటిన తర్వాత అక్కడే ఉండిపోయేవారిని గుర్తించి వెనక్కి పంపిస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, వీసా రద్దుతో పాటు భవిష్యత్తులో తిరిగి అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తోందని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది.
US Embassy
US visa
Indian students
United States
Visa regulations
Visa overstay
Immigration
American Embassy Delhi
US immigration policy
Student visa

More Telugu News