Home Fire Ritual: ఇంట్లో హోమం చేస్తుంటే ఇంటిముందు ప్రత్యక్షమైన ఫైరింజన్.. వీడియో ఇదిగో!

Texas Family Fire Ritual Interrupted by Fire Department
  • అమెరికాలోని టెక్సాస్ లో హిందూ కుటుంబం గృహప్రవేశం
  • గ్యారేజ్ లో హోమం చేస్తుండగా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసిన ఇరుగుపొరుగు
  • హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్లు
నూతన గృహప్రవేశం సందర్భంగా హోమం చేస్తున్న ఓ కుటుంబానికి పక్కింటి వాళ్లు షాకిచ్చారు. అగ్నిప్రమాదం జరుగుతోందని ఫోన్ చేయడంతో ఫైరింజన్ తో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో హోమం చేసుకుంటుంటే అగ్నిమాపక సిబ్బంది రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. గృహప్రవేశం విధానం, హోమం విశిష్టత గురించి వివరించి చెప్పడంతో అగ్నిమాపక సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు.

అమెరికాలోని టెక్సాస్ లో జరిగిందీ ఘటన. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చర్చకు దారితీసింది. హోమం పేరుతో స్థానిక చట్టాలను, ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఆ కుటుంబం అతిక్రమించిందని కొందరు విమర్శిస్తుండగా.. వారి మతసంప్రదాయాలను పాటించే హక్కు అందరికీ ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు.

అమెరికాలో నివాస సముదాయాలను చెక్కతో నిర్మిస్తారని గుర్తుచేస్తూ.. సంప్రదాయం పేరుతో నిప్పుతో చెలగాటం ఆడడం సరికాదని కొంతమంది విమర్శిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగితే ఇరుగుపొరుగు వారికీ ముప్పు పొంచి ఉందని చెబుతూ.. వారు అగ్నిమాపక సిబ్బందిని పిలవడాన్ని సమర్థించారు. కాగా, ఈ ఘటనలో సదరు హిందూ కుటుంబంపై అగ్నిమాపక సిబ్బంది ఏం చర్యలు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది.
Home Fire Ritual
Texas
Fire Department
Home Fire Ritual in America
Fire Safety
Cultural Practices
Housewarming Ceremony
Fire Hazard
American Homes

More Telugu News