Guvvala Balaraju: బీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
- రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించిన బాలరాజు
- ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
- ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలరాజు
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అచ్చంపేట నుంచి బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో బాలరాజు భేటీ అయ్యారు. దీంతో, ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.
తన రాజీనామా లేఖలో బాలరాజు పలు విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని చెప్పారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఎంతో ఆలోచించిన తర్వాత బాధతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా పని చేయడం గర్వంగా ఉందని చెప్పారు. కష్ట సమయంలో పార్టీని వీడటం బాధగా ఉందన్నారు.