Upasana Kamineni: అర్ధాంగికి బెస్ట్ విషెస్ తెలిసిన రామ్ చరణ్

Ram Charan wishes Upasana Konidela on new role
  • తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో–చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం
  • అర్ధాంగి కొత్త పదవి చేపట్టడంపై ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన రామ్ చరణ్
  • తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్ పర్సన్‌గా ఉపాసన కొణిదెల నియమితులైన విషయం విదితమే. ఈ విషయంపై ప్రముఖ నటుడు రామ్ చరణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, తన అర్ధాంగి ఉపాసనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన పదవిలో నియమితురాలైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

ఇటీవల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. మెగా అభిమానులు, నెటిజన్లు ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
Upasana Kamineni
Upasana Konidela
Telangana Sports Hub
Telangana sports
Ram Charan
Revanth Reddy
sports news
Hyderabad sports

More Telugu News