Mohammed Siraj: మా యూనిఫాం హీరో... సిరాజ్ పై తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రశంసలు

Telangana Police Proud of DSp Mohammed Siraj Cricket Success
  • టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై హైదరాబాద్ పోలీసుల ప్రశంసలు
  • ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు అభినందనలు
  • సిరాజ్ తెలంగాణకు గర్వకారణం అంటూ పోలీస్ శాఖ కితాబు
  • ఆయన క్రీడల్లోనే కాదు, యూనిఫాంలోనూ హీరో అని ప్రశంస
  • సిరాజ్ తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్‌పై తెలంగాణ పోలీస్ శాఖ ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సిరాజ్ అద్భుత ప్రదర్శనను అభినందిస్తూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా స్పందించింది. సిరాజ్ కేవలం క్రీడాకారుడే కాకుండా, పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాలో ఉన్న అధికారి కావడం విశేషం.

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ తన అసాధారణ బౌలింగ్‌తో జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ విజయం తర్వాత సిరాజ్‌ను అభినందిస్తూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. "డీఎస్పీ మహ్మద్ సిరాజ్‌కు అభినందనలు. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక టెస్టు గెలుపులో మీ ప్రదర్శన అమోఘం" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, సిరాజ్‌ను 'తెలంగాణ గర్వకారణం' (ప్రైడ్ ఆఫ్ తెలంగాణ) అని అభివర్ణించారు. "క్రీడల్లోనే కాదు, యూనిఫాంలోనూ హీరో" (హీరో ఇన్ యూనిఫామ్ అండ్ స్పోర్ట్) అంటూ కితాబు ఇచ్చారు. సిరాజ్ రాణించడంపై తెలంగాణ పోలీస్ శాఖలో హర్షం వ్యక్తమవుతోంది.
Mohammed Siraj
Siraj
Hyderabad Police
Telangana Police
India vs England
Test Series
Cricket
DSp Mohammed Siraj
Indian Cricket Team
Pride of Telangana

More Telugu News