YS Sharmila: వైఎస్ షర్మిలపై పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు: కిల్లి కృపారాణి
- పీసీసీ చీఫ్ మార్పుపై అనుమానాలు వద్దన్న కృపారాణి
- షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని వ్యాఖ్య
- పీవోకేను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీపీ చీఫ్ మార్పుపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆమె అన్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ షర్మిలపై పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ షర్మిలదేనని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని... అయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ ను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని అడిగితే... కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని... పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందని ప్రశ్నించారు.
నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని అన్నారు. రాజా హరిసింగ్ సమయంలోనే శ్రీనగర్ కు పాక్ దళాలు వచ్చాయని... అప్పుడు నెహ్రూ సహాయాన్ని హరిసింగ్ కోరారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకే ఎల్వోసీ ఏర్పాటయిందని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతిస్తే... ఆయన సుంకాల పేరుతో భారత్ ను బాదేస్తున్నారని విమర్శించారు.