Ashok Gajapathi Raju: రాష్ట్రపతి, ప్రధాని మోదీలను కలిసిన అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju Meets President and PM Modi
  • గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన అశోక్ గజపతిరాజు
  • తొలుత రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన అశోక్ గజపతిరాజు
  • పార్లమెంటులో మోదీ, అమిత్ షాలతో భేటీ
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గవర్నర్ గా నియమితులైన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలుత ఆయన రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. 

అనంతరం పార్లమెంటుకు వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంటు వద్ద అశోక్ గజపతిరాజుకు టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు.
Ashok Gajapathi Raju
Goa Governor
Droupadi Murmu
Narendra Modi
Amit Shah
JP Nadda
Ram Mohan Naidu
Delhi Visit
TDP MP

More Telugu News