Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో బయటపడ్డ 8వ శతాబ్దం నాటి దేవతా విగ్రహాలు

Ancient Hindu Idols Unearthed in Jammu and Kashmir
  • కర్కోట రాజుల కాలం నాటివని భావిస్తున్న శాస్త్రవేత్తలు
  • అనంత్ నాగ్ జిల్లాలోని కర్కూట్ నాగ్ లో పురాతత్వ శాఖ తవ్వకాలు
  • బయటపడ్డ శివ లింగాలు, ఇతర విగ్రహాలు
జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో పురాతన కాలం నాటి హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. జిల్లాలోని కర్కూట్ నాగ్ ప్రాంతంలో పురాతత్వ శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా.. పలు శివలింగాలు, ఇతర దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయని చెప్పారు. ఈ విగ్రహాలు 8వ శతాబ్దం నాటివని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కర్కోట రాజులు పాలిస్తుండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో గుడి ఉండి ఉండొచ్చని వివరించారు.

ప్రస్తుతం విగ్రహాలు దొరికిన చోటులో అప్పట్లో బహుశా ధర్మగుండం ఉండొచ్చని పురాతత్వశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బయటపడ్డ విగ్రహాలను మ్యూజియానికి తరలించి భద్రపరుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, కర్కోట రాజుల కాలంలో పూజారులుగా వ్యవహరించిన కశ్మీరీ పండిట్ల వారసులు మాత్రం ఈ విగ్రహాలను జాగ్రత్త చేసి ఇదేచోట ఆలయం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Jammu and Kashmir
Anantnag
Hindu idols
8th century
excavation
Karkoot Nag
Shivlingas
archaeological site
Karkota dynasty

More Telugu News