Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన 'మహా' మంత్రికి డిమోషన్

Minister Manikrao Kokate Demoted for Playing Rummy in Assembly
  • ఇటీవల అసెంబ్లీలో మొబైల్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి మాణిక్ రావ్ కోకటే
  • మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డ ప్రతిపక్షాలు
  • వ్యవసాయ శాఖ నుంచి తప్పించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
అసెంబ్లీలో మొబైల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చర్యలు తీసుకున్నారు. మంత్రి మాణిక్ రావ్ ను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (అజిత్) చీఫ్ అజిత్ పవార్ తో భేటీ తర్వాత ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఓవైపు చర్చ జరుగుతుండగా వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే మాత్రం మొబైల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఓవైపు రాష్ట్రంలోని రైతాంగం సమస్యలతో సతమతమవుతూ, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి పట్టింపే లేకుండా పోయిందని ఆరోపించాయి.

అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ కూర్చోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తాజాగా మాణిక్ రావ్ పై చర్యలు తీసుకున్నారు.
Manikrao Kokate
Maharashtra
Maharashtra Assembly
Rummy Game
Devendra Fadnavis
Agriculture Minister
Sports Minister
Ajit Pawar
Farmers Issues

More Telugu News