Urvashi Rautela: మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన‌ హీరోయిన్ ఊర్వశి రౌతేలా బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ

Urvashi Rautelas Dior bag stolen at London airport jewellery worth Rs 70 lakh missing
  • వింబుల్డన్ టోర్నీకి హాజరైన ఊర్వశి రౌతేలా
  • భారత్‌కు తిరుగు ప్రయాణంలో గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె లగ్జరీ సూట్‌కేస్ చోరీ
  • ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయ‌న్న న‌టి
  • ఈ మేర‌కు నిన్న త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలియ‌జేసిన ఊర్వ‌శి
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలాకు లండన్‌లో ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఆమె లగ్జరీ సూట్‌కేస్ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో చోరీకి గురైంది. ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన నగలు ఉన్నట్లు ఊర్వశి తెలిపారు. కాగా, ఈ నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ఊర్వశి హాజర‌య్యారు. 

త‌న‌ విలువైన వస్తువులు పోవ‌డాన్ని ఊర్వ‌శి గురువారం త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు ద్వారా తెలియ‌జేశారు. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, విమానాశ్ర‌య‌ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయారు. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన లేద‌న్నారు. కాగా, ఊర్వశి రౌతేలాకు ఇంత‌కుముందు కూడా ఇలాంటి కొన్ని ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి. 2023లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో రూ. 45 లక్షల విలువైనవి పోగొట్టుకున్నారు. అలాగే గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురైన‌ట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. 
Urvashi Rautela
Urvashi Rautela theft
Wimbledon
Gatwick Airport
jewelry theft
London
Bollywood actress
crime news
theft
Urvashi Rautela news

More Telugu News