YS Jagan: జ‌గ‌న్ నెల్లూరు ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసుల న‌మోదు

Three Cases Filed Against YSRCP Leaders During Jagans Nellore Visit
  • నిన్న నెల్లూరులో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌
  • వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిబంధ‌న‌ల ఉల్లంఘన‌
  • మూడు కేసులు న‌మోదు చేసిన పోలీసులు
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. జగన్‌ పర్యటనలో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పోలీసులు ఈ కేసులు న‌మోదు చేశారు. మాజీ మంత్రి ప్ర‌స‌న్నకుమార్ రెడ్డి ఇంటికెళ్లే రోడ్డు వ‌ద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాగిప‌డేసి.. ప‌రుగులు తీశారు. 

దాంతో కావ‌లికి చెందిన స్పెష‌ల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాల‌కొండ‌య్య బారికేడ్ కింద ప‌డిపోవ‌డంతో చేయి విరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌స‌న్న‌, బొబ్బ‌ల శ్రీనివాస్ యాద‌వ్‌, పాత‌పాటి ప్ర‌భాక‌ర్ త‌దిత‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

ఈ ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి, మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టినందుకు దర్గామిట్ట పోలీసులు మ‌రో కేసు నమోదు చేశారు. 
YS Jagan
Nellore
Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Nallapureddy Prasanna Kumar Reddy
Police Case
Road Accident
Traffic Disruption
YSR Congress

More Telugu News