TTD: శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు... టీటీడీ వార్నింగ్

TTD Warns Strict Action Against Reels in Tirumala Temple
  • కొంతకాలంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద రీల్స్ చిత్రీకరిస్తున్న వైనం 
  • తీవ్రంగా పరిగణిస్తున్న టీటీడీ 
  • తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని స్పష్టీకరణ
తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటీవల కొందరు ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో రీల్స్ చిత్రీకరిస్తున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది.

టీటీడీ అధికారులు ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలు భక్తి వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని, భక్తులకు అసౌకర్యం కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. ఎవరైనా శ్రీవారి ఆలయం లేదా ఇతర టీటీడీ ఆలయాల వద్ద రీల్స్, వెకిలి చేష్టలతో వీడియోలు వీడియోలు, షార్ట్స్ చిత్రీకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులంతా ఆలయ నియమాలను పాటించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

TTD
Tirumala
Tirupati
TTD Reels Ban
Tirumala Temple
Reels Ban
Tirupati Devasthanam
Temple Reels
AP News
Andhra Pradesh

More Telugu News