Rajayya: ఆ పదిమంది తక్షణమే రాజీనామా చేయాలి: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజయ్య

Rajayya Demands Resignation of 10 Defected MLAs
  • ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో సభాపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టు వారిని అనర్హులుగా ప్రకటిస్తుందన్న రాజయ్య
  • ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్న రాజయ్య
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో సభాపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మూడు నెలలలోపు స్పీకర్ చర్యలు తీసుకోవాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

స్పీకర్ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా ఆయా ఎమ్మెల్యేలను ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుందని తెలిపారు. ఆరేళ్ల వరకు కనీసం వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయడానికి వారు అనర్హులు అవుతారని వ్యాఖ్యానించారు. ఆరు నూరైనా ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నిర్ణయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీలోకి వెళ్లిన వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
Rajayya
BRS
Telangana MLAs
Party Defection
Supreme Court
Speaker
MLA Resignation
Telangana Politics
By Elections

More Telugu News