జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలు
- నేడు నెల్లూరు వచ్చిన జగన్
- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పరామర్శ
- జగన్ రాకతో ఒక్కసారిగా తోసుకువచ్చిన కార్యకర్తలు
జగన్... ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ప్రయోజనం లేకపోయింది. వైసీపీ కార్యకర్తలు అలాగే ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత్ ఇప్పటికే ఆరా తీశారు. శాంతిభద్రతలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.