Panneerselvam: తమిళనాడులో ఎన్డీయేకు పన్నీర్ సెల్వం షాక్!
- ఎన్డీయే నుంచి వైదొలిగిన మాజీ ముఖ్యమంత్రి
- ఎన్డీయే నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన మాజీ మంత్రి రామచంద్రన్
- మార్నింగ్ వాక్‌లో స్టాలిన్‌తో ముచ్చటించిన తర్వాత ప్రకటన!
తమిళనాడు రాజకీయాల్లో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలిగారు. ఈ మేరకు మాజీ మంత్రి, పన్నీర్ సెల్వంకు నమ్మినబంటు అయిన రామచంద్రన్ ప్రకటించారు. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు రామచంద్రన్ ప్రకటిస్తున్న సమయంలో పన్నీర్ సెల్వం కూడా అక్కడే ఉన్నారు.
అంతకుముందు, ఉదయపు నడక సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్ సెల్వం కలిశారు. వీరి మధ్య తమిళ రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పన్నీర్క సెల్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని రామచంద్రన్ తెలిపారు. పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సమీపించిన సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతామని ఆయన తెలిపారు.
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగ (టీవీకే) పార్టీతో పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నట్లు తమిళ మీడియాలో ప్రచారం సాగుతోంది. పొత్తుల గురించి విలేకరులు పన్నీరుసెల్వంను ప్రశ్నించగా, కాలమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.