Iran Sanctions: ఇరాన్‌తో లావాదేవీలు.. ఆరు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!

US Sanctions Imposed on Indian Firms Over Iran Deals
  • ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులతో లావాదేవీలు
  • టర్కీ, యూఏఈ, చైనా, ఇండోనేషియా దేశాల సంస్థలు కూడా ఆంక్షల పరిధిలోకి
  • నిందితుల ఆస్తులు, ఆస్తి హక్కులు అన్నీ బ్లాక్ అవుతాయని అమెరికా స్పష్టీకరణ
ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులకు సంబంధించిన కీలక లావాదేవీల్లో పాల్గొన్నందుకు భారత్ సహా పలు దేశాలకు చెందిన సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో ఆరు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. టర్కీ, యూఏఈ, చైనా, ఇండోనేషియా దేశాల సంస్థలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి.

అమెరికా ఆరోపణల ప్రకారం ఈ భారతీయ సంస్థలు 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు మిథనాల్, టోలుయీన్, పాలిథిలీన్ వంటి పదార్థాలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారతీయ కంపెనీల జాబితాలో కాంచన్ పాలిమర్స్, ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామనీక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. "ఈ సంస్థలు ఇరాన్ నుంచి మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి" అని అమెరికా స్పష్టం చేసింది.   

ఈ ఆంక్షలు కేవలం సాంకేతికమైనవి కావని అమెరికా స్పష్టం చేసింది. "అమెరికాలో లేదా అమెరికా వ్యక్తుల ఆధీనంలో ఉన్న నిందితుల ఆస్తులు, ఆస్తి హక్కులు అన్నీ బ్లాక్ అవుతాయి" అని స్పష్టం చేసింది. అయితే, "ఆంక్షల అంతిమ లక్ష్యం శిక్షించడం కాదు, సానుకూల మార్పును తీసుకురావడం" అని తెలిపింది. ఈ ఆంక్షలపై భారతీయ సంస్థలు ఇంకా ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయలేదు. 
Iran Sanctions
Indian Companies
US Sanctions
Petroleum Products
Petrochemicals
Kanchan Polymers
Alchemical Solutions Private Limited
Ramniklal S Gosalia and Company
Jupiter Dye Chem Private Limited
Global Industrial Chemicals Limited

More Telugu News