Pakistan Cricket Team: ఒలింపిక్స్ 2028.. పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు భారీ ఎదురుదెబ్బ‌..?

No Pakistan Cricket Team In 2028 Olympics Claims Report
  • 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ
  • టీ 20 ఫార్మాట్‌లో ఆడ‌నున్న ఆరు జ‌ట్లు 
  • రీజియ‌న్ల వారీగా టాప్ ర్యాంక్ జ‌ట్ల‌ను ఎంపిక చేయ‌నున్న ఐసీసీ 
  • దీంతో ర్యాంకుల్లో వెనుక‌బ‌డి ఉన్న పాక్‌కు చోటు క‌ష్ట‌మ‌న్న‌ ఓ నివేదిక
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. టీ 20 ఫార్మాట్‌లో ఆరు జ‌ట్లు ఆడ‌నున్నాయి. ఇందులో పాల్గొనే జ‌ట్ల‌ను రీజియ‌న్ల వారీగా టాప్ ర్యాంక్ జ‌ట్ల‌ను ఐసీసీ ఎంపిక చేయ‌నుంద‌ని స‌మాచారం. 

దీని ప్ర‌కారం ఆసియా నుంచి భార‌త్‌, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి ద‌క్షిణాఫ్రికా, యూర‌ప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అయ్యే అవ‌కాశ‌ముంది. ఆరో జ‌ట్టును ఎలా ఎంపిక చేస్తార‌నే దానిపై క్లారిటీ లేదు. దీంతో ర్యాంకుల్లో వెనుక‌బ‌డి ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్‌కు చోటు క‌ష్ట‌మ‌ని ఓ నివేదిక పేర్కొంది.

"ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆసియా, ఓషియానియా నుంచి భారత్‌, ఆస్ట్రేలియా వరుసగా అర్హ‌త సాధిస్తాయి. అలాగే ఆఫ్రికా నుంచి ద‌క్షిణాఫ్రికా, యూర‌ప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అవుతాయి. ఈ మేర‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రాంతీయ అర్హతను సమర్థిస్తుంది. తద్వారా ఇది ప్రపంచవ్యాప్త ఈవెంట్‌గా ఉంటుంది" అని 'ది గార్డియన్' ఒక నివేదికలో తెలిపింది.   
Pakistan Cricket Team
Olympics 2028
Cricket
ICC Rankings
India
Australia
South Africa
England
Los Angeles Olympics

More Telugu News