Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన 'కింగ్ డమ్' టీమ్

Pawan Kalyan Meets Kingdom Movie Team
  • విజయ్ దేవరకొండ హీరోగా 'కింగ్ డమ్' మూవీ 
  • రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ 
  • ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లిన కింగ్ డమ్ టీమ్ 
  • బెస్ట్ విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్ 
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కింగ్ డమ్. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం రేపు (జులై 31) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, కింగ్ డమ్ టీమ్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిసింది. 

పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కింగ్ డమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, నిర్మాత నాగవంశీ... ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై పవన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కింగ్ డమ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు  తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 
Pawan Kalyan
Vijay Deverakonda
Kingdom Movie
Gowtam Tinnanuri
Bhagyashri Borse
Sithara Entertainments
Fortune Four Cinemas
Tollywood
Usthad Bhagat Singh

More Telugu News