Naman Preet Kaur: నా భర్త అమెరికాలో అక్రమంగా ఉంటున్నాడు.. వెనక్కి పంపించండి: భారత మహిళ విజ్ఞప్తి

Naman Preet Kaur Asks US Immigration to Deport Husband
  • తనను, తన బిడ్డను వదిలి అమెరికాలో నివసిస్తున్నాడని ఆవేదన
  • సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన మహిళ నమన్ ప్రీత్ కౌర్
  • నాకు, నా కుమార్తెకు న్యాయం చేయండంటూ అభ్యర్థన
భర్తను వెనక్కి పంపించాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను వేడుకుంటూ భారత్‌కు చెందిన ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తన భర్త తనను, బిడ్డను వదిలి అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"నా పేరు నమన్ ప్రీత్ కౌర్. నేను ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నాను. 2022లో నా భర్త శరణార్థిగా అమెరికాకు వచ్చారు. అక్కడ ఆయన ఎవరినైనా వివాహం చేసుకున్నారా, సహజీవనం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను ఆయనకు చట్టబద్ధమైన భార్యను. మాకు ఏడేళ్ల కూతురు ఉంది" అని ఆమె తెలిపారు.

"డబ్బు, పౌరసత్వం కోసం మమ్మల్ని వదిలి అక్రమంగా అమెరికాకు వెళ్లారు. ఆయన కాలిఫోర్నియాలో అక్రమంగా ఉంటున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో నాకు, నా కూతురికి న్యాయం జరగాలి. నా భర్తను వెనక్కి పంపడంలో సహాయం చేయమని కోరుతున్నాను. నా భర్త కుటుంబం నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి" అని ఆమె పేర్కొంటూ, తమ పెళ్లి నాటి ఫొటోలను పోస్టు చేశారు.
Naman Preet Kaur
US Immigration
Illegal Immigration
Deportation Request
California

More Telugu News