Anasuya Bharadwaj: ఆ మహిళలు ఎవరో తెలియదు... కానీ నన్ను విమర్శించారు: అనసూయ

Anasuya Responds to Criticism on Social Media
  • మరోసారి అనసూయపై ట్రోలింగ్
  • బోల్డ్ గా ఉండడం అంటే అమర్యాదకరంగా ఉన్నట్టు కాదన్న అనసూయ
  • నా స్టయిల్ కు తగిన దుస్తులు వేసుకుంటానని స్పష్టీకరణ
టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. అందుకే కొన్ని సార్లు ఆమె ట్రోలింగ్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, విమర్శలకు సంబంధించి అనసూయ సోషల్ మీడియాలో స్పందించారు. 

తాను బోల్డ్ గా ఉండడం గురించి మహిళలే విమర్శిస్తున్నారని వెల్లడించారు. ఆ మహిళలెవరో తనకు తెలియదని, తన గురించి వారికి తెలియదని, కానీ కొన్ని వీడియోల్లో వారు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని తెలిపారు. 

"నేను ఓ తల్లిగా వ్యవహరించడంలేదని వారు ఎలా చెబుతారు? నాకు పెళ్లయింది... ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త, నా పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు... వాళ్లు నన్ను ఎప్పుడూ విమర్శించలేదు. బోల్డ్ గా ఉండడం అంటే అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నా స్టయిల్ కు తగిన దుస్తులు వేసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాను. దానర్థం నేను విలువలు కోల్పోయానని కాదు. తల్లి అయినంత మాత్రాన మన అభిరుచులకు తగినట్టు ఉండకూడదా?" అని అనసూయ ప్రశ్నించారు. 
Anasuya Bharadwaj
Anasuya
Tollywood actress
social media
criticism
trolling
boldness
personal attacks
women critics

More Telugu News