Indore: ఆ జిల్లాలో ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్' అమలు

Indore to Implement No Helmet No Petrol Rule From August 1
  • ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా బంకుకు వస్తే ఇంధనం నింపవద్దన్న అధికారులు
  • ఎల్లుండి నుండి ఈ నిర్ణయం అమలులోకి..
  • కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచన
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్' విధానం అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జిల్లా అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇండోర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకునేలా ఇండోర్‌‌లో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ వెల్లడించారు.

ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Indore
Indore traffic rules
No helmet no petrol
Madhya Pradesh
Road safety committee
Justice Abhay Manohar Sapre

More Telugu News