Chiranjeevi: ఫ్యాన్ మూమెంట్... మెగాస్టార్ చిరంజీవితో మౌనిరాయ్... ఫొటో ఇదిగో!

Mouni Roy Shares Fan Moment with Chiranjeevi on Viswambhara Sets
  • విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్ 
  • చిరంజీవితో ఆడిపాడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్ 
  • ఇటీవలే షూటింగ్ కంప్లీట్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక ప్రత్యేక గీతంతో ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌని రాయ్ సందడి చేశారు. తాజాగా, సెట్స్ పై చిరంజీవితో మౌని రాయ్ కలిసున్న ఫొటో విడుదలైంది. ఇందులో చిరు స్మార్ట్ లుక్ తో అదరగొడుతున్నారు. మౌనిరాయ్ ఎంతో వినయంగా ఆయన పక్కన నిల్చుని ఉండడం ఈ ఫొటోలో చూడొంచ్చు.

విశ్వంభర’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిరంజీవి, మౌనిరాయ్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చిన ఈ పాటను వందమంది డ్యాన్సర్లతో అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించారు. చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్స్‌తో అభిమానులను అలరించడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది.స

ఈ చిత్రం సత్యలోకం నేపథ్యంలో రూపొందుతోందని, బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

‘విశ్వంభర’ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథ, రచన, దర్శకత్వం బాధ్యతలను వశిష్ట నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంపై చిరంజీవి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Chiranjeevi
Viswambhara
Mouni Roy
UV Creations
Vasishta
Telugu Movie
Keeravani
Bheems Ceciroleo
Trisha
Ashika Ranganath

More Telugu News