Raja Raghuvanshi: తెరకెక్కుతున్న హనీమూన్ మర్డర్ కేసు

Raja Raghuvanshi Honeymoon Murder Case to be Filmed as Bollywood Movie
  • ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరు ఖరారు
  • ఎస్ పీ నింబావత్ దర్శకత్వంలో షూటింగ్ కు ఏర్పాట్లు
  • సమ్మతి తెలిపిన రాజా రఘువంశీ కుటుంబం
మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా రానుంది. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెబుతూ.. సినిమా తీసేందుకు తమ ఆమోదం తెలిపినట్లు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్ పీ నింబావత్ డైరెక్షన్ లో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో తెరకెక్కనుంది. షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు నింబావత్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. 80శాతం చిత్రాన్ని ఇండోర్‌లో, 20 శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తామని చెప్పారు. అయితే, నటీనటుల వివరాలను ఆయన వెల్లడించలేదు.

కేసు నేపథ్యం..
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి ఈ ఏడాది మే 11న సోనమ్‌ రఘువంశీతో వివాహం జరిగింది. కొత్త దంపతులు హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు. అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో రోడ్డు పక్కన డాబా వద్ద సోనమ్ రఘువంశీ ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే, విచారణలో సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది. ఈ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Raja Raghuvanshi
Meghalaya honeymoon murder case
Honeymoon in Shillong movie
Sonam Raghuvanshi
SP Nimbawat
Bollywood movie
Indore murder
Crime thriller
Murder mystery
honeymoon murder

More Telugu News