Burkina Faso Attack: బుర్కినాఫాసోలో సైనిక స్థావరంపై దాడి.. 50 మంది సైనికుల మృతి

Burkina Faso Attack 50 Soldiers Killed in Military Base Raid
  • బౌల్సా ప్రావిన్స్‌లోని డార్గోలో ఉన్న సైనిక స్థావరంపై దాడి
  • దాడిలో పాల్గొన్న 100 మంది ఉగ్రవాదులు
  • దాడి అనంతరం స్థావరాన్ని తగలబెట్టిన వైనం
  • దాడిచేసిన జేఎన్ఐఎం అల్‌ఖైదాకు అనుబంధం
బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలోని ఓ సైనిక స్థావరంపై సాయుధులు జరిపిన దాడిలో సుమారు 50 మంది సైనికులు మరణించారు. సోమవారం బౌల్సా ప్రావిన్స్‌లోని డార్గోలో ఉన్న సైనిక స్థావరంపై ఈ దాడి జరిగింది. జమాఅత్ నస్ర్ అల్-ఇస్లామ్ వాల్-ముస్లిమీన్ (జేఎన్ఐఎం) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి తర్వాత స్థావరాన్ని తగలబెట్టి దోచుకున్నట్టు వారు తెలిపారు.  
 
పశ్చిమ ఆఫ్రికా అంతటా దాడులు చేస్తున్న అనేక సాయుధ సమూహాలలో జేఎన్ఐఎం ఒకటి. ఇది అల్ ఖైదాకు అనుబంధంగా పశ్చిమ ఆఫ్రికాలో పనిచేస్తున్న సంస్థ. ఇది వందలాది మంది పౌరులు, సైనికుల మరణాలకు కారణమవుతోంది. బుర్కినా ఫాసోలో, ముఖ్యంగా రాజధానికి వెలుపల, దేశంలోని చాలా భాగాలను నియంత్రిస్తున్న సాయుధ సమూహాల దాడులు ఇటీవల బాగా పెరిగాయి. సైనిక నాయకుడు ఇబ్రహీం ట్రాయోర్ రాజకీయ, సైనిక మిత్రదేశాలను పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఇస్లామిస్ట్ సమూహాలను నియంత్రించడంలో విఫలమయ్యారు.
Burkina Faso Attack
Burkina Faso
JNIM
Al-Qaeda
Dargo Military Base
Sahel Terrorism
West Africa Terrorism
Ibrahim Traore

More Telugu News